ఆఁధ్ర మహిళా బ్లాగర్లకు నమస్కారములు . మీరంతా ఆనందముతో నూతన సంవత్సరాన్ని గడపాలని మేము కోరుకుఁటున్నాము. అన్నిరంగాలలో మహిళలు ముందుకు దూసుకు పోతున్న ఈరోజులలో మీకు అండదండలుగా మగవాల్లమంతా నిలబడాల్సి వుంది. అలాఉండకపోతే ఉంచే శక్తిసామర్ధ్యాలు మీకున్నాయని చరిత్ర చరిత్ర వెనక్కి మల్లి చూస్తె చెబుతుంది. ఈసందర్భంగా మావంతుగా మీకొరకేదన్నా చేయాలనే తపన తో మీ అభిమానాన్ని పొందాలనే ఉత్సాహంతో 2008 లో నెలరోజులు ఆలో చించగా ..ఆలోచించగా నాకు ఏ గొప్ప ఇంజనీర్ కు రాని ఔడియా వచ్చేసింది. ఈ ఇంజనీర్లంతా ఏదో ఒకటి అంటే ఫ్రిజ్, వాషింగ్ మెష్షిన్ ,క్లీనర్ ,, మిక్సీ ,గ్రైండర్ లాంటివి కనిపెట్టారే గాని కాలనుగుణముగా సాంప్రదాయ వస్తువుల ను కూడా కాలానుగుణంగా మెరుగుపెట్టి మీకఁదివ్వలెక పొయారు. కనుక ఆదిశగా నా పరిశోధనలు సాగుతున్నాయి. దీనిలో మీరు కూడా భాగస్వాములైతేనేగాని ఇది విజయవంతమవదు.
నేను ముఖ్యముగా చెప్పొచ్చేదేమిటంటే ఈ మిషన్లనన్నింటినీ సక్రమంగా నడపటానికి మనవాళ్ళు రిమోట్ కంట్ఱోల్లను తయారు చేసారు కదా. ఇదేమి పెద్ద గొప్పవిషయం కాదు. పూర్వం నుంచి మనకు సాంప్రదాయ పరంగా వస్తున్నది. పూజ్యులు పెద్దవారు బాపు గారి లాంటి మహాను భావుల చేతిలొ పలు సార్లు డిజైన్లు చేయబడిన "హ్యూమన్ రిమోట్ కంట్రోలర్" మీకు తెలిసినదే. దానిద్వారా స్త్రీలు ఎంతో సమర్ధవంతంగా సంసారపు బాధ్యతలను మగవాళ్లచేత నిర్వహింపజేసెవారు గతం లొ. అయితే ఈ మధ్యకాలములో విదేశీ శక్తులతో బాటు శ్వదేశీ శాస్త్రవెత్తలతో కలసి కుట్రపన్ని అనేక రకాల పరికరాలు తయారు చేసి ఇల్లలొకి చొప్పిఁచటం వలన మీ చెతిలో సాంప్రదాయకముగా ఉండే ఆయుధం ..సారీ.. రిమోట్ మీకుదూరమయినదని నా పరిశీలనలో తేలినది. కనుక దానివలన మొగుడు అనబడే హ్యూమన్ మిషన్ సరిగా పని చేపించే పరికరం లేక మీరు చాలా ఇబ్బంది పడుతున్నారనే విషయము కూదా మాదృ ష్టికి వచ్చినది. కాబట్టి మీకు మరలా ఆపరికరం అందుబాటు లోకి తేవాలన్నదే మా ఆశయం.
గతం లో మీరు బాపు గారి కార్టూన్లన్నింటి లోనూ దీని ఉపయోగాలు ఎన్నిరకాలుగా వుంటాయో చూసి ఉంటారు. అయితే మార్పు అనేది తప్పనిసరి కనుక దీనిని ఇంకా సౌలభ్యంగా వుండేవిధంగా తయారు చెయ్యలను కుంటున్నాము. దీనికి తెలుగు మహిళా లోకానికి ఒక పోటీ పెట్టి వారినుంచి కొణ్ణి డిజైన్లు అడుగుతున్నాము. దీనికి మీరు చేయవలసినదల్లా ఒకటె .సాంప్రదాయంగా వాడే రిమోట్ [ అప్పడాలకర్ర] లో ఏదన్నా మార్పులు చేయాలా?వద్దా?. చేస్తే ఎలాంటి మార్పులు ఉండాలి. ? మీరు చక్కటిసూచనలను చేయాలి. మీరు తమ అభిప్రాయాలను దానిలో సూచనలను వెంటనె పంపగలరు. వీటినుండి అన్నింటికన్నా బాగావున్న ముగ్గురిని ఎంపిక చేసి .వారికి బహుమతులివ్వబడతాయి. ఇలాఁటి సెంషేషనల్ ప్రయోగాలను ప్రోత్సహించేందుకు పలు వ్యాపార సంస్థలు ముందుకొస్తున్నాయి. కనుక కానుకల వర్శమే కురుస్తుంది మీపైన ,. బాగున్న డిజైన్లను మన బ్లాగ్లోకము లోవున్న కార్టూనిష్ట్ లద్వారా
రూపురేఖలు చిత్రంపజేసి. దానిని పెద్దవారు బాపుగారిచే ఫైనల్ చేపించి పూర్తి రూపాన్నిస్తాము.
దానిని పావలా వడ్డీ పథకంద్వారా తయారు చేపించేందుకు డ్వాక్రా మహిలలకే అప్పగిస్తాము. దానిని విస్తృతంగా వినియోగము లోనికి తెచ్చేందుకు మీడియా అంతా సిద్దంగా ప్రచారానికి కాచుకు కూర్చున్నది. అమ్మలారా! త్వరపడండి. ఎన్నికలసమయం కూడా వచ్చేస్తుంది కనుక మన ప్రయోగం విస్త్రుతంగా ప్రచారమయితే రాజకీయ పార్టీలు కూడా దీనిపంపిణీకోసం పలు కార్యక్రమాలను తమ మానిఫెస్టోలో చేర్చే అవకసమున్నది. జ్ఞానబుడిపెలను ప్రసాదించగల ఈ హ్యూమన్ రిమోట్ కంట్రోలర్ వర్ధిల్లాలని, మహిళా సాధికారతతేలికగా సాధిఁచగలిగే ఈ రిమోట్ మరింత విస్తరిల్లాలని వాంఛిస్తూ ..... ... మహిళా సాధికారతా అభిమానులు... ఆంధ్రప్రదేశ్
విన్నపము: ఇంకా ఏమైనా సూచనలుంటే పంపగలరు.
లోడ్ అవుతోంది...